తొక్కుడు బిళ్ల
ముక్కెర పుల్ల
పిల్ల కోతి ఆటకు మల్ల
కలిసి ఆడే గిల్లి దండ
గెలిచినారంటే వెన్నెల నిండా.....
ఈ పని పాటలతో పల్లె కలిసునదిరా..
ఈ అనుబంధాలే పల్లెకు సొంతం కదరా...
కాలం మారుతువున్న కపటం యెరుగని పల్లె ..
సిందే సేమటలతోని సిరులని పంచే ముల్లె..
తుమ్మి పూల తూనీగల పొప్పడి గంధాల పట్టుచీర కట్టుకుంది పల్లె సందేల.